వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి లో పల్లెల్లో పనుల జాతర 2025లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి,పీడబ్ల్యు రోడ్డు నుండి బురాన్ పల్లి వరకు నూతన బిటి రోడ్డుకు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అయిన మహాలక్ష్మి పథకం కింద ఇంటి యజమానికి 2500 ఆర్థిక సహాయం కళ్యాణ లక్ష్మికి ఇవ్వాల్సిన తులం బంగారం త్వరలోనే చెల్లించినట్లు తెలిపారు.