కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేటలోని సబ్ జైలును గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ప్రవర్తన, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ జైలు భద్రతకు సంబంధించి సూపరింటెండెంట్కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు.