రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపం గా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి శనివారం మధ్యాహ్నం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన జీవ 28 రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి మొగులయ్య, నాయకులు బసవరాజ్ తదితరులు ఉన్నారు.