ఫుడ్ సేఫ్టీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డిలు శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని రెండు బార్ & రెస్టారెంట్ లు తనిఖీ చేయడం జరిగింది. కరీంనగర్ బస్టాండ్ పక్కనే ఉన్న దర్బార్ బార్ & రెస్టారెంట్ మరియు నటరాజ్ బార్ & రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది.దర్బార్ బార్ లో ముందు రోజు మిగిలిన మటన్, మొక్కజొన్న, వెజ్ మంచూరియన్, లాంటి ఐటమ్స్ పరిశీలించి మున్సిపల్ చెత్తలో పడివేసినట్లు తెలిపారు. అలాగే బార్ లో హైజీన్ కి సంబంధించిన లోపాలు లు కూడా గుర్తించి వాటికి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది.