అనంతపురం జిల్లా నార్పల మండలం మడుగు పల్లి సమీపాన శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న అనంతపురం నగరంలోని తపోవనంకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతపురం నుండి బుక్కాపురం కు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మడుగు పల్లి సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.