ఈనెల 27వ తేదీ బుధవారం రోజున వినాయక చతుర్థి సందర్భంగా పారిశ్రామి ప్రాంతంలోని పలు కూడలలో వినాయక విగ్రహాలు, వినాయక అలంకరణ పత్రిలు, పూజ సామాగ్రి అమ్మకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రామగుండం కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్ టి పి సి ఆర్ ఎఫ్ సి ఎల్ ఎనిమిదో కాలనీ పట్టణ ప్రధాన చౌరస్తాలో వినాయక విగ్రహాల కొనుగోలులో భక్తులు సందడి చేశారు. వినాయక విగ్రహాలు గతం ఏడాది కంటే విపరీతంగా రేట్లు పెరిగాయని వినియోగదారులు తెలిపారు. ఏది ఏమైనా బుధవారం జరగబోయే వినాయక చవితి పూజలకు ఈ ప్రాంత ప్రజలు విగ్రహాలను పూజ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు చౌరస్తాలో సందడి వాతావరణం నెలకొంది.