పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.మధిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.