తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుపతి ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ చారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎండాకాలంలో వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన కూడలిలో మొబైల్ అంబ్రెల్లాస్ ను ఏర్పాటు చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని రద్దీని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ సిబ్బందికి మెరుగైన వాతావరణం కల్పించేందుకు సుమారు 20 ట్రాఫిక్ మొబైల్ అంబ్రెల్లాస్ ను ఏర్పాటు చేశారు మొదటి దశలో తన పల్లి ఆర్ సి పురం జంక్షన్ వార్తా క్రాస్ మ్యాంగో మార్కెట్ గరుడ సర్కిల్ తదితర ప్రాంతాలలో ఈ మొబైల్ అంబ్రెల్లాస్ ను ఏర్పాటు చేశారు.