కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం లోని మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి విడుదల చేస్తున్న నీటిని బుధవారం రాత్రి నిలిపేసినట్లు మైలవరం జలాశయ అధికారులు తెలిపారు. కొండాపురం మండలంలోని గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి ఇన్ ఫ్లో లేని కారణంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు 120 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 5.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం అధికారులు తెలిపారు.