జగిత్యాల పట్టణంలోని 29 వ వార్డులో మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆడంబరాలకు పోకుండా ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల గృహ నిర్మాణం మంజూరుతో 600 చదరపు అడుగులలో గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నవన్నారు. గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు నిర్మాణం చేపట్టలేదు అని అన్నారు.