జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని రైతు సేవ కేంద్రాలలో యూరియా పై ప్రత్యేక అవగాహన సదస్సులు మూడు రోజుల పాటు నిర్వహిస్తామని, ఆదివారం మధ్యాహ్నం గంట్యాడ లో మండల వ్యవసాయాధికారి బి శ్యాం కుమార్ తెలియజేశారు. రేణిగుంట రోజు లాగా మండల పరిధిలో ఉన్న అన్ని రైతు సేవ కేంద్రాలకు యూరియా నిల్వలు వస్తాయని అందువలన రైతులు ఎవరు ఆందోళన పడవద్దని సూచించారు.