పల్నాడు జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కొరకు ఆన్లైన్లో నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మాట్లాడుతూ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.పరిమితికి మించి సౌండ్ పెట్టవద్దన్నారు.నిమజ్జన సూచనలు కచ్చితంగా అమలు చేయాలని,ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని,పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.