షాద్ నగర్ పట్టణానికి చెందిన నరసింహచారి, అరుణ దంపతుల కుమార్తె సహర్ష ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించింది. రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.