గునుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకు మూసివేశారు. ఆలయ ప్రధానార్చకులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ గ్రహణం ఆదివారం రాత్రి 9:48 నుంచి 1:30 వరకు ఉంటుందని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయ తలుపులు తెరిచి, భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తామని తెలిపారు.