దళిత,బహుజనులపై అగ్రవర్ణాల దోపిడిని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక గౌడ కులస్తులతో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారు మాట్లాడారు దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన యోధుడు పాపన్న గౌడ్ అన్నారు. బహుజన వాదంతో కూడిన ఆయన ఆశలను కొనసాగించాలన్నారు.