దంతాలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ పర్యటించారు . తొలుత కుక్కుడం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం పెద్ద ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ దృక్పథానికి ప్రతిక అని, గృహ హక్కు ప్రతి పేద కుటుంబానికి చేరాలన్నదే మా సంకల్పం అని అన్నారు .