సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకొని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధన చేయాలని మండల విద్యాధికారి విద్యాసాగర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ (RPs) శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.