శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కొండనాయిని పాలెం వద్ద పోలీసులు దాడులు నిర్వహించి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను వెల్లడించారు.