రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మంగళవారం నాయుడుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి ప్రజా ప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన వైయస్సార్ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని సంజీవయ్య అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు