జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ లో ఇండ్ల మధ్యలో నిర్మిస్తున్న ఓ సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా టవర్ వద్ద కాలనీవాసులు నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ ఇండ్ల మధ్యలో నిర్మిస్తున్న టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.కాలనీలో చిన్న పిల్లలు వృద్దులు అనేక మంది ఉన్నారని,రేడియేషన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతారు అన్న ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.