Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
నెల్లూరు జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని రైతు సంఘ నాయకుడు కాకు వెంకటయ్య మంగళవారం ఉదయగిరి లో ఆరోపించారు. 'రైతులు నగలు, భూమి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో వరి చేతికి రానుంది. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది. రైతులు నష్టపోయి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి' అని ఆయన కోరారు