ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా "సండేస్ ఆన్ సైకిల్" కార్యక్రమాన్ని రాయచోటిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, "సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. సైక్లింగ్ వలన పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది" అని అన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, సిఐ టివి.కొండారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వి.జె.రామకృష్ణ, యం.పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ స