రంపచోడవరం నియోజకవర్గంలో సోమవారం వినాయక విగ్రహాల నిమజ్జనా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి పంచమి నవరాత్రులు ముగియడంతో సోమవారం ఆయా విగ్రహాలను నిమజ్జనం చేశారు దేవీపట్నం,రాజవొమ్మంగిలోనిమజ్జనం ఊరేగింపులు సోమవారం ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను భక్తులు వీదుల్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో, బాణా సంచా కాల్పులతో హోరేతింది. మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. ఊరేగింపు అనంతరం సమీప కాలువల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు