వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల చెందిన సంగమేశ్వర అనే వ్యక్తి ఈనెల 27వ తేదీన కోట్పల్లి వాగులో పడిపోయి కొట్టుకపోవడంతో భార్య పిర్యాదు మేరకు మేరకు దారుర్ సీఐ రఘురాములు, ఎస్సై శైలజ పర్యవేక్షణలో కోట్పల్లి బోటింగ్ లైఫ్ గాడ్స్ సహకారంతో గాలింపు కొనసాగింది. దీంతో శుక్రవారం ఉదయం వాగులో కొంత దూరంలో సంగమేశ్వర్ శవం లభ్యం కావడంతో మార్పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించిపోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఆందోళనలతో కన్నీటి పర్యంతమయ్యారు.