శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో బాడ వైకుంఠరావు కు చెందిన రెండు ఎకరాల గడ్డివాము శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు అగ్నికి ఆహుతి అయింది. విషయం తెలుసుకున్న పలాస అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తపరుస్తున్నారు.