ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం రోడ్డుపై హల్ చల్ సృష్టించాడు. నడిరోడ్డుపై కూర్చుని వాహనాలకు అడ్డుగా ఉండడంతో ప్రమాదాలు జరగే పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా పరిగెత్తడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు