బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న అన్నారు. అనపర్తి జెడ్పి బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల్లో దీనిపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చు అన్నారు న్యాయమూర్తి.