రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ఆందోళనలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియాను సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఆందోళనలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.