స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కృష్ణ ఈనెల 25న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష తలపెట్టారని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నం నారాయణ గౌడ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సత్యాగ్రహ దీక్షకు జిల్లా నుండి వేల సంఖ్యలో బీసీలు హాజరై దీక్షను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు