ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి తెలియచేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో కలసి అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఎరువుల సరఫరా, నిల్వలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎరువులకు ఎటువంటి కొరత లేకుండా చూడాలన్నారు.