దళితులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది: సుధాకర్ అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయన పక్కదారి మళ్లించారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దళితులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని తెలిపారు.