మెట్పల్లి 9వ వార్డ్ పద్మశాలి సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక మెట్పల్లి పట్టణంలోని 9వ వార్డు పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాసపత్రి భూపతి, ఉపాధ్యక్షుడిగా గుంటుక హనుమాన్లు, కార్యదర్శిగా చిలివేరి శ్రీనివాస్, కోశాధికారిగా పసునూరి ఆనంద్, ప్రచార కార్యదర్శిగా పొన్న భూపతి, గౌరవ అధ్యక్షులుగా రాంపల్లి రమేష్, సంకు గంగాధర్, సలహాదారులుగా అంజయ్య, జ్ఞానేశ్వర్, చాట్ల గణేశ్, సుధాకర్, రాధా, స్వరూపలను ఎన్నుకున్నారు.