అప్పలరాజుగూడెం సమీపంలో ఎర్ర కాలువను దాటే క్రమంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కొట్టుకుపోయారని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. అప్పలరాజుగూడెం సమీపంలో ఉన్న ఎర్ర కాలువలో సుబ్బారావు గల్లంతైన సంగతి విధితమే ఈమేరకు ఆదివారం గజ ఈతగాళ్లతో గాలించిన అనంతరం మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ చెప్పారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.