చంద్రగ్రహణం కారణంగా ఆదివారం నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహానివేదన, హారతి అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల ద్వారాలను కూడా మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం వేకువజామున 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, గ్రహణ సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి యథావిధిగా అన్ని సేవలు కొనసాగుతయన్నారు