తెలంగాణ క్యాబినెట్లో 42% స్థానాలు BCలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిందని కరీంనగర్ MLA గంగుల కమలాకర్ అసెంబ్లీలో ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గుర్తుచేశారు. మంత్రివర్గంలో BCలకు అవకాశం ఇవ్వాలన్నారు. ఏడాదికి 20వేల కోట్లు BCలకు కేటాయిస్తామన్నారు. 20 నెలలైనా 20 పైసలు కూడా ఇవ్వలేదు. MBC కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి చట్టం అవసరం లేదు. CM ఒక్క సంతకం పెడితే అయిపోతుంది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ లను మోసం చేసే పార్టీ అని వాఖ్యనించారు గంగుల కమలాకర్.