ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 15 వార్డు జనసేన నాయకులు సుంకర మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరు లోని జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస నగర్‌లోని జనసేన కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా “జై జనసేన – జై పవన్ కళ్యాణ్” నినాదాలతో కార్యాలయం ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా సుంకర మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.