తాడిపత్రి మండలం ఓబులేసు కోన కు వెళ్లే రహదారిలో ఆదివారం వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. నీటి ప్రవాహంలో కమాండర్ జీపు కొట్టుకుపోయింది. నీటి ఉధృతిని అంచనా వేయడంలో కమాండర్ జీపు డ్రైవర్ విఫలమయ్యాడు. దీంతో నీటిలో అలాగే జీపును నడపడం వల్ల నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. జీపు ఆచూకీ కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులు ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.