ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద నానాటికీ అధికమవుతోంది. ఈ మధ్య కాలంలో చాలా మందిని వీధి కుక్కలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపం వద్ద మంగళవారం మందలు మందలుగా రోడ్లపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.