తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీ ఉప్పరపల్లి గ్రామంలో మురికి కాలువ పొంగి నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది దీనివల్ల ప్రతిరోజు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ ప్రజలు వాహనదారులు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు.