శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంతో కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 200 ఎకరాల పై చిలుకు వరి,పత్తి, మొక్కజొన్న,పసుపు పంటలు జలమయం అయ్యాయి. శనివారం బాధిత రైతులు మాట్లాడుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తు నీట మునిగిన పంటలను అధికారులు సందర్శించి నష్టపరిహారం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత రెండు రోజులుగా మొత్తానికి నీట మునగడంతో పంటలు పనికిరాకుండా పోతాయని అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం అందించలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.