కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తుంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం పట్టణ కేంద్రం రావులపాలెంలో బుధవారం జరిగిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 93 వేల కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.