వ్యాయామ, కుస్తీ క్రీడలు శారీరక మానసిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాచిరెడ్డి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం వెల్చల్ దర్గా సమీపంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పోటీలు ప్రారంభించారు. పలువురు కుస్తీ వీరుల ప్రదర్శన అక్కడి వారిని ఆకట్టుకుంది.