కల్లూరు అర్బన్ పరిధిలోని కార్మిక కర్షక భవన్‌లో సోమవారం సిఐటియు న్యూ సిటీ 3వ మహాసభలు ఘనంగా జరిగాయి. పతాకావిష్కరణ అనంతరం, సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం అవసరమని చెప్పారు. వివిధ యూనియన్ల నివేదికలు సమర్పించగా, పటిష్టమైన కార్మిక రాజ్యం కోసం కృషి చేయాలని తీర్మానించారు. 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.