నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్టాండ్ అంబేద్కర్ విగ్రహాం వద్ద మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్కడి నుండి నిర్మల్ చౌరస్తా వరకు బైక్ వెళ్లి నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.