మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెం సమీపంలోని గౌరారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో సోమవారం మధ్యాహ్నం కొత్తూరు-మోట్లగూడెం బొమ్మాయిగూడెం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లరాదని అధికారులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.