జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వినాయక చవితి సందర్బంగా గణేశుడి పూజా కార్యక్రమం నిర్వహించబడింది.జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే, IPS గారు పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందారు.పూజా కార్యక్రమం అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరూ సమష్టిగా శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి పండుగలు పోలీసు సిబ్బందికి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కల్పించాలనరు.