సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయరాం, కూటమి నాయకులతో కలసి లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. లక్కిరెడ్డిపల్లె(M)దూదేకుల పల్లెకు చెందిన జమీలకు రూ.1,72,000, దిన్నేపాడుకు చెందిన ముబారక్ బాషాకు రూ.45 వేలు మంజూరయ్యాయన్నారు.