పండగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. మంగళవారం 12 గంటలకు రుద్రూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో దుర్గామాత మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నిర్వాహకులు ప్రభుత్వం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, డీజేలను వాడరాదని, ఊరేగింపు సమయంలో శబ్ద కాలుష్యాన్ని పెట్టరాదని విద్యుత్తు ను సక్రమంగా అమర్చుకోవాలని సూచించారు.