మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు. మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీహర్ష(17) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఈక్రమంలో అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు శ్రీహర్ష మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు,