కామారెడ్డిలో జిల్లా బీబీపేట పెద్ద చెరువులో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. చెరువులోని నీరంతా వెళ్లిపోతున్న తరుణంతో ఆయకట్టును కాపాడుకునేందుకు స్థానిక రైతులు నడుంబిగించారు. గండి వద్ద వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఇసుక బస్తాలు,సిమెంట్, గడ్డి వేసి గండి పూడ్చుతున్నారు.